అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వం తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో సుమారు 20 మంది చనిపోయారని.. ఆ ఘటనకు ఎవరిని బాధ్యులుగా చేశారని ప్రశ్నించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో అల్లు అర్జున్ ఉండనున్నారు. ఈ నేపద్యంలో 27వ తేదీ వరకు అల్లు అర్జున్ రిమాండ్ లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ఆయనను నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకి భారీ భద్రత నడుమ తరలించారు.…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో చెంచల్ గూడా జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో వాదోపవాదాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు14…
Addanki Dayakar : పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసులో ఐకాన్ స్టార్ అర్జున్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సినీ, రాజకీయ ప్రముఖలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంల కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి…
అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఇప్పటివరకు అల్లు అర్జున్ కి బెయిల్ లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. నిజానికి అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసు నాన్ బెయిలబుల్ అయినా ఆ కేసులో 11వ నిందితుడు కావడంతో బెయిల్ ఈజీగా లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే నాంపల్లి కోర్టు అందరికీ షాక్ ఇస్తూ ఈ కేసులో అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్…
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమైన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. పోలీసులు ముందు నుంచి సంధ్య థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని చెబుతూ వచ్చారు. కానీ ప్రీమియర్ షో కి రెండు రోజుల ముందే అంటే రెండవ తేదీన అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ ఉండే అవకాశం ఉండడంతో పోలీసు భద్రత కోరుతూ సంధ్య థియేటర్ పోలీసులకి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.…
Harish Rao : జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అని ఆయన అన్నారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే అని హరీష్ రావు మండిపడ్డారు. చర్యలు…
జాతీయ స్థాయి సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయటం అక్రమమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఖండించారు. పుష్ప-2 విడుదల సందర్భంగా ఆకస్మికంగా తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు.
తనను అరెస్టు చేయడానికి తన నివాసానికి వచ్చిన పోలీసులను చూసి అల్లు అర్జున్ షాక్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప సెకండ్ పార్ట్ సూపర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఉదయమే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నివాసానికి చేరుకుని ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానంకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. స్నానం చేస్తున్న సమయంలోనే పోలీసులు నివాసానికి వచ్చారు.…
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ముందుగా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని జడ్జి ఎదుట హాజరపరచగా ప్రస్తుతానికి వాదనలు…