CM Revanth Reddy : ఢిల్లీలో ఆజ్ తక్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ లు ఎందుకు రెస్ట్ అయ్యారని, దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ అరెస్టు చేసామంటున్నారు.. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడని, ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారని, జనం ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా అని ఆయన ప్రశ్నించారు. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని, కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేదన్నారు. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశారని, దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Andhra Pradesh: రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నిక
అంతేకాకుండా..’అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11 గా పోలీసులు పెట్టారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత.. అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత .. నాకు బంధువు.. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు.. హోం శాఖ నా వద్ద ఉంది, ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసు.. చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడు.. సినిమా కోసం పైసలు పెట్టారు పైసలు సంపాదించారు.. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదు.. నా ఫేవరెట్ హీరో కృష్ణ.. ఆయన ఇప్పుడు లేరు.. ఇప్పుడు నేనే స్టార్‌ను నాకే ఫాన్స్ ఉంటారు ఉండాలి కూడా’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Allu Arjun: చంచల్గూడ జైలులోకి వెళ్లిన వెంటనే అల్లు అర్జున్ కి బెయిల్