భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించారు. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని అందులో పేర్కొన్నారు. అణ్వాయుధాలు ఉన్న భారతదేశం, పాకిస్థాన్ ఎప్పటికీ యుద్ధం చేయలేవన్నారు. ఉగ్రవాదం, పౌరుల హత్యలను వ్యతిరేకించారు. ఇస్లామిక్ బోధనలు, అంతర్జాతీయ సూత్రాలు, మానవ విలువలలో…
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అందిన 1.25 కోట్ల సమర్పణలపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కోరారు. దీని వెనక వాంటెడ్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్, పాకిస్తాన్ ఐఎస్ఐ, చైనాల పాత్ర ఉందని అతడు అనుమానించారు.
Ram Mandir: దేశం మొత్తం జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కీలక వ్యక్తులు, సాధువులు 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది.
Jamiat chief: కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్(UCC))ని తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. 2024 ఎన్నికల ముందు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు లా కమిషన్ సంప్రదింపులను ప్రారంభించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ యూనిఫాం సివిల్ కోడ్ పై అత్యున్నత ఇస్లామిక్ సంస్థ అయి జమియల్ చీఫ్ అర్షద్ మదానీ స్పందించారు.
ఉదయ్ పూర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజస్థాన్ లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది. ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మద్దతు ఇస్తూ పోస్ట్ చేసిన కన్హయ్య లాల్ అనే వ్యక్తిని ఇద్దరు మతోన్మాదులు రియాజ్ అక్తర్, గౌస్ మహ్మద్ అత్యంత పాశవికంగా తలను కోస్తూ చంపేశారు. చంపడమే కాకుండా ఈ సంఘటనలను వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్…
ఓ టీవీ డిబెట్ లో పాల్గొంటూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో, విదేశాల్లో దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ, మలేషియా, ఇరాక్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలిపాయి. భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని.. వ్యక్తులు చేసిన…
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు అంశం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ ఉత్తర్వుల మేరకు మే 14-16 వరకు మసీదులో వీడియో సర్వే నిర్వహించి మే 17న రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ నియమించిన కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ రోజే వీడియోగ్రఫీ సర్వే వివరాలను కోర్ట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే జ్ఞానవాపీ మసీదులోని వజూ ఖానాలోని బావిలో శివలింగ భయటపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీడియో సర్వేకు మరింత సమయం కావాలని కోర్ట్ కమిషనర్లు వారణాసి…