Uniform Civil Code: కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్(UCC))ని తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. 2024 ఎన్నికల ముందు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు లా కమిషన్ సంప్రదింపులను ప్రారంభించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ యూనిఫాం సివిల్ కోడ్ పై అత్యున్నత ఇస్లామిక్ సంస్థ అయి జమియల్ చీఫ్ అర్షద్ మదానీ స్పందించారు.
యూసీసీని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమని, అయితే దీన్ని వ్యతిరేకించేందుకు వీధుల్లోకి వెళ్లి నిరసన చెపట్టమని అర్షద్ మదానీ ఆదివారం అన్నారు. మాకు గత 1300 ఏళ్లుగా వ్యతిగత చట్టాలు ఉన్నాయి. మేము వాటికి కట్టుబడి ఉంటామని, స్వాతంత్య్రం తరువాత ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం యూసీసీ అవసరం లేదని, దీని వల్ల నిరసనలు జరుగాయని, హిందువులకు, ముస్లింలు దూరం అవుతారని తెలిపారు. దీని వల్ల కొంతమంది వ్యక్తుల దురుద్దేశ లక్ష్యం నెరవేరుతుందని మదానీ చెప్పారు.
Read Also: Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..
ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మౌలానా తౌకీర్ రజా ఖాన్ మాట్లాడుతూ.. యూసీసీ అమలు చేయడం బీజేపీకి ఎన్నికల్లో గెలిచే ఒక సాధనం మాత్రమే అని అన్నారు. యూసీసీ అనవసరమైనదని, ఆచరణీయం కాదని, దేశానికి అత్యంత హానికరమైనదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పేర్కొంది. ముస్లిం వ్యక్తిగత చట్టాలు ఖురాన్, సున్నత్ నుంచి ఉద్భవించాయి, అందువల్ల ముస్లింలకు కూడా ఎటువంటి మార్పులు చేయడానికి అధికారం లేదని బోర్డు తన వైఖరిని చెబుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాలు గందరగోళం, అస్తవ్యస్తతకు దారి తీస్తాయని, ఇది బుద్ది ఉన్న ప్రభుత్వం చేసే చర్య కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఈ అంశంపై మునపటి లా కమిషన్ 2018లో సంప్రదింపుల నివేదిక ప్రచురించిందని, అయితే తాజా సంప్రదింపుల ఎందుకు అవసరం అవుతాయో ప్రస్తుత లా కమిషన్ స్పష్టం చేయలేదని అన్నారు.