అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేయడంపై బుధవారం నాడు తక్షణ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తావించారు.
పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని(థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యం ఉందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేసింది. అనవసరమైన ప్రభావం ఉన్నందున తక్షణమే అమలులోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది.