భాగ్యనగరంలో భారీగా పెరిగిన మద్యం ధరలు మద్యం ప్రియులకు తలనొప్పిగా మారాయి. అమాంతంగా పెరిగిన ధరల దృష్ట్యా లిక్కర్ వినియోగం కొంత వరకు తగ్గింది. కానీ.. ఆబ్కారీ శాఖ ఆదాయం మాత్రం పెరిందనే చెప్పాలి. అన్ని రకాల బీర్లు, మద్యం బ్రాండ్ లపైన ప్రభుత్వం కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్టంగా సుమారు రూ. 160 వరకు ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో బ్రాండ్ ధర ఒక్కోవిధంగా పెరిగింది. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన…
నగరంలో ఇకపై 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో మద్యం అనుతించబడదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల, ప్రతినిధుల దృష్ట్యా ఐదంతస్తుల రేటింగ్ ఉన్న హోటల్‌కు 24 గంటలు మద్యం అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, అది సాధారణ ప్రజలకు కాదని, ఆయా హోటల్స్‌లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్‌కు అపఖ్యాతి తీసుకురావద్దని…
చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై ఆధారపడే నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.. బీహార్‌లో కూడా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు.. ఇదే సమయంలో.. కల్తీ మద్యం తాగి మృతిచెందేవారి సంఖ్య కూడా పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించిన ఆయన.. వారిని భారతీయులుగా తాను భావించనని పేర్కొన్నారు..…
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిల్లో ఆల్కాహాల్ ఒకటి. దీని ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తుంది. అయితే, ఆల్కాహాల్ తీసుకున్న తరువాత మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై వైద్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. మగ్గబెట్టిన పండ్లు, ధాన్యం, కూరగాయలతో మద్యాన్ని తయారు చేస్తారు. వీటిని మగ్గబెట్టినపుడు దాని నుంచి ఈస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఈస్ట్ నుంచి అల్కాహాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఈస్ట్ నుంచి ఈథనాల్ కూడా ఉత్పత్తి అవుతుంది. మద్యాన్ని సేవించిన…
పెళ్లిళ్లు అంటే ఎలాంటి హడావుడి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు దావత్ చేసుకుంటారు. అదేవిధంగా డ్యాన్సులు, హంగామా ఉంటుంది. ఆ తంతు జరిగే సమయంలో చాలా పెళ్లిళ్లలో గొడవలు జరుగుతుంటాయి. పెళ్లి ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో ఈ తంతు కారణంగా అదనంగా బోలెడు ఖర్చులు అవుతుండటంతో రాజస్తాన్‌లోని గోడీ తేజ్‌పూర్ అనే గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లలో దావత్, డీజే, బరాత్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. గ్రామంలోని మాజీ, ప్రస్తుత సర్పంచ్‌లు ఈ…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్లు, ఆహరపు అలవాట్లు తదిత అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల సారాంశాన్ని ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రీషన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ జర్నల్ ప్రకారం, వారానికి నాలుగు నుంచి 5 గ్లాసుల వరకు రెడ్ వైన్ తీసుకునేవారు కరోనా మహమ్మారి బారిన పడటం 17 శాతం వరకు తక్కువుగా ఉంటుందని పరిశోధకులు…
తండ్రి మద్యానికి బానిస కావడంతో ఈ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడింది. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన మానుకోలేదు. తండ్రితో ఎలాగైనా మద్యాన్ని మాన్పించాలని 13 ఏళ్ల కుమారుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే ప్లాన్ ను సిద్ధం చేసుకున్నాడు. తన తండ్రి మద్యానికి బానిస అయ్యాడని, తన కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోందని, తన, తన సోదరి చదువుకు ఇది విఘాతంగా మారిందని గ్రామ సభలోని పెద్దలకు ఫిర్యారు చేశాడు. తన సోదరిని ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని అనుకుంటున్నానని,…
దాడి చేసిన వ్యక్తులు గౌతమ్, మనోజ్, మానిక్ ఎల్బీనగర్లో దారుణం జరిగింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దన్నందుకు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై మద్యం బాబులు దాడికి దిగారు. కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అక్కడి కాలనీ యువకులు తాగొద్దని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం చెందిన మందు బాబులు కాలనీ యువకులపై దాడి చేశారు. మృతుడు నరసింహ రెడ్డి సోదరుడు హనుమంతు మాట్లాడుతూ.. మద్యం మత్తు…
నవ్వుపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి.. నవ్వని వాడు మనిషే కాదు అని ఎందరో అంటే.. నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు కూడా లేకపోలేదు.. అయితే, ఆ నవ్వు గోల ఎలా ఉన్నా.. సంచలన నిర్ణయాలకు వేదికైన ఉత్తర కొరియా.. తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో నవ్వడం నిషేధం విధించింది.. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.. కేవలం నవ్వడంపై మాత్రమే కాదు మద్యం సేవించడం, సరుకులు కొనేందుకు షాపింగ్‌కు…
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యానగర్ రైల్వే బ్రిడ్జి పై మద్యం మత్తులో దూసుకొచ్చిందో కారు. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో వాహనదారుడికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ నమోదైంది. దీంతో వాహనదరుడి పై కేసు నమోదు చేసుకుని కారు సీజ్ చేశారు నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు. READ ALSO బంజారాహిల్స్‌లో…