దాడి చేసిన వ్యక్తులు గౌతమ్, మనోజ్, మానిక్
ఎల్బీనగర్లో దారుణం జరిగింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దన్నందుకు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై మద్యం బాబులు దాడికి దిగారు. కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అక్కడి కాలనీ యువకులు తాగొద్దని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం చెందిన మందు బాబులు కాలనీ యువకులపై దాడి చేశారు. మృతుడు నరసింహ రెడ్డి సోదరుడు హనుమంతు మాట్లాడుతూ.. మద్యం మత్తు దాడి ఘటనలో నరసింహ రెడ్డి మృతి చెందాడని చెప్పాడు. గౌతమ్, మనోజ్, మిట్టు, మానిక్ అనే యువకులు మద్యం మత్తులో దాడి చేశారని ఆరోపణలు చేస్తున్న మృతుడు నర్సింహరెడ్డి అన్న హనుమంతు. నిర్మానుష్య ప్రాంతంలో తరచూ మద్యం సేవించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
Read Also: పేదల ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి: రామకృష్ణ
ఫంక్షన్ హాల్‌కు సంబంధించిన ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉండొద్దని చెప్పినందుకు కోపంతో దాడి చేశారు. వీరితో పాటు కార్లలో దాదాపు 20 మంది రాడ్లు, కర్రలతో వచ్చి మాపై దాడి చేశారు. దీంతో నరసింహరెడ్డికి గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహరెడ్డి మృతి చెందాడని హనుమంతు పేర్కొన్నారు. నరసింహరెడ్డి స్నేహితుడు గౌస్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి మద్యం మత్తులో మా పై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. నాతో పాటు నరసింహారెడ్డి ఉన్నాడు. వాళ్లు మొత్తం నలుగురు వ్యక్తులు గౌతమ్, మనోజ్, మిట్టు, మానిక్..నాపై మనోజ్ అనే వ్యక్తి దాడి చేశాడు. మొత్తం 20 మంది వచ్చారు. నరసింహరెడ్డికి గాయాలు అవ్వడంతో అక్కడిక్కడే స్పృహ కోల్పోయాడు. నేను అక్కడి నుండి తప్పిచుకొని వచ్చానని గౌస్ చెప్పాడు. దాడి అనంతరం మందు బాబులు ఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.