ఈ రోజుల్లో ఆల్కహాల్ తాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న కార్యక్రమమైనా, ఎవరి బర్త్‌డే వేడుకలైనా సరే.. మద్యం బాటిల్‌ను తెరవడం తప్పనిసరి అయిపోయింది. నేటి యుగంలో గెట్-టుగెదర్‌లు, పార్టీలలో మద్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీకెండ్ల కోసం ఎంతో మంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. కానీ మద్యం తాగడం వల్ల శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి.