ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమాలో పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిన విషయమే. ఈ సినిమాలోని కొన్ని పాటలు యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాటకు మిలియన్స్ వ్యూస్ వచ్చి చేరాయి. తాజాగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ 700 మిలియన్ వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురములో”. బన్నీ ఈ సినిమాతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అంతేనా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 2019లో విడుదలైన టాలీవుడ్ టాప్ చిత్రాల్లో ముందు వరుసలో నిలిచింది “అల వైకుంఠపురములో”. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చి, హిట్ అయిన హ్యాట్రిక్ మూవీగా మరో రికార్డును క్రియేట్ చేసింది. “అల వైకుంఠపురములో” సినిమాకు చినబాబు నిర్మాతగా వ్యవహరించగా, తమన్ అందించిన…
నాగ శౌర్య మరియు రీతూ వర్మ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “వరుడు కావలెను”. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ “వరుడు కావలెను” టీజర్, ట్రైలర్, ఎల్లో కలర్, ఎడిటర్ నవీన్ నూలి, నిర్మాతలు నాగ వంశీ, చిన్నబాబు, మ్యూజిక్ కంపోజర్ థమన్ వంటి సినిమా కోర్ టీమ్ తనకు ‘అల వైకుంఠపురములో’…
2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020 సంవత్సరంలో జరగలేదు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 18న ప్రారంభం కాగా పలువురు సినీ స్టార్స్…
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. ఈవెంట్‌లో తన సినిమా వరుసగా అవార్డులు గెలుచుకోవడం చూసి అల్లు అర్జున్ బృందం సంతోషంగా ఫీల్ అయ్యింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ హిందీలో ‘షహజాదా’గా రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక్కడ అల్లు అర్జున్, పూజా హెగ్డే పోషించిన పాత్రలను హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ పోషించబోతున్నారు. పరేశ్ రావెల్, మనీషా కొయిరాలా సైతం కీలక పాత్రలకు ఎంపికైనట్టు తెలుస్తోంది. వరుసగా రెండు పెద్ద బ్యానర్స్ నుండి కార్తీక్ ఆర్యన్ ను తప్పించిన నేపథ్యంలో ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ ఆఫర్ రావడం అందరినీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురంలో”. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కృతి సనోన్ హీరోహీరోయిన్ల పాత్రలు పోషించనున్నారు. తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో…
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురములో” చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం విజయవంతం కావడానికి మ్యూజిక్ ముఖ్యకారణం అని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘సామజవరగమనా సాంగ్, బుట్టబొమ్మ, రాములో రాములా, ఓహ్ మై గాడ్ డాడీ, సిత్తరాలా సిరపడు… ఇలా ఆల్బమ్‌లోని ప్రతి సాంగ్ కు అద్భుతమైన స్పందన…