నాగ శౌర్య మరియు రీతూ వర్మ నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “వరుడు కావలెను”. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ “వరుడు కావలెను” టీజర్, ట్రైలర్, ఎల్లో కలర్, ఎడిటర్ నవీన్ నూలి, నిర్మాతలు నాగ వంశీ, చిన్నబాబు, మ్యూజిక్ కంపోజర్ థమన్ వంటి సినిమా కోర్ టీమ్ తనకు ‘అల వైకుంఠపురములో’ జ్ఞాపకాలను తెచ్చిపెట్టాయని అన్నారు.
నాగశౌర్య సినిమా నేపథ్యం లేకుండా కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న తీరును తాను మెచ్చుకుంటున్నానని అల్లు అర్జున్ అన్నారు. చిత్ర కథానాయిక రీతూ వర్మ గురించి మాట్లాడుతూ తనకు సాధారణంగా తెలుగు నటీమణుల పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుందని, తొలి చిత్రం నుండి టాలీవుడ్‌లో రీతూ వర్మ ఎదుగుదలని తాను గమనిస్తున్నానని చెప్పాడు. ఇక ఆమె ఏం చేసినా ఒక డిగ్నిటీ కన్పిస్తుందని, అది తనకు చాలా ఇస్తామని అన్నారు.
Read Also : తమన్నా పరువు అడ్డంగా తీసిన ‘మాస్టర్ చెఫ్’ యాజమాన్యం!
“వరుడు కావలెను” దర్శకురాలు లక్ష్మీ సౌజన్యలాగా ఎక్కువ మంది మహిళా సాంకేతిక నిపుణులు టాలీవుడ్‌లోకి ప్రవేశించాలని బన్నీ అన్నారు. నిర్మాతలు నాగ వంశీ, చినబాబు ఇద్దరూ సినిమా నిర్మాణం పట్ల ఎంత మక్కువ చూపుతున్నారో, ‘అల వైకుంఠపురములో’ సమయంలో వారు మంచి కంటెంట్‌కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారో తనకు తెలుసని అల్లు అర్జున్ చెప్పాడు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రానున్న అన్ని భారీ బడ్జెట్ సినిమాలు గ్రాండ్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ బన్నీ తన ప్రసంగాన్ని ముగించాడు.