ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురములో” చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం విజయవంతం కావడానికి మ్యూజిక్ ముఖ్యకారణం అని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘సామజవరగమనా సాంగ్, బుట్టబొమ్మ, రాములో రాములా, ఓహ్ మై గాడ్ డాడీ, సిత్తరాలా సిరపడు… ఇలా ఆల్బమ్‌లోని ప్రతి సాంగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా “బుట్టబొమ్మ” సాంగ్ కు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. తాజాగా “బుట్టబొమ్మ” యూట్యూబ్‌లో కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ‘బుట్ట బొమ్మ’ సాంగ్ యూట్యూబ్‌లో 400 మిలియన్ల లైక్‌లను పొందింది. టాలీవుడ్‌లో 400 మిలియన్ల లైక్‌లను పొందిన మొట్టమొదటి వీడియో సాంగ్‌గా నిలిచింది ఈ సాంగ్. అంతేకాదు ఈ పాట ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధికంగా వీక్షించబడిన, వీక్షకులు ఎక్కువగా ఇష్టపడిన వీడియో సాంగ్ గా నిలిచింది. అర్మాన్ మాలిక్ “బుట్ట బొమ్మ” సాంగ్ ను ఆలపించగా… రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని రచించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఎస్ రాధా కృష్ణ అల్లు అరవింద్ సహకారంతో దీనిని నిర్మించారు. అల్లు అర్జున్ పూజా సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం గత ఏడాది జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే.