ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య నాలుగేండ్లలోనే విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా షాక్ కు గురైయ్యారు. ఇక వీరి విడాకుల విషయమై ఎవరికి తోచిన విధానంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రియల్ లైఫ్ ప్రేమలో విఫలమైన వీరిద్దరూ.. తిరిగి రీల్ లైఫ్ లో మరోసారి నటించాలని ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారు. విడిపోయాక కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని వారే చెపుతున్నారని.. తిరిగి…
చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆగస్ట్ లో సినిమాలు థియేటర్లలో విడుదల కావడం మొదలైంది. ఆ నెలలో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజ రాజ చోర’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలను ప్రేక్షకులు కాస్తంత ఆదరించారు. అయితే…. అసలైన ఊపు సెప్టెంబర్ మాసంలో వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో అనువాద చిత్రాలతో కలిసి ఏకంగా 31 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు 20 కాగా, వివిధ భాషల…
కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన అజాగ్రత్తగా వుండే మాత్రం ఇక అంతే సంగతిని కరోనా పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. రానున్న రెండు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెపుతున్నాయి. కాగా, ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే సినీ అభిమానులకు పాత రోజులు వచ్చినట్లుగానే థియేటర్లు, సరికొత్త టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో అలరిస్తుండగా, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్-5 షో కూడా ప్రారంభం…
రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆకట్టుకొంది. నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మలిచాడు విజయ్ కనకమేడల.. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదివరకే విజయ్ కనకమేడల నరేట్ చేసిన స్టోరీకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు…
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడాయన మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి వార్ మూవీ “లాల్ సింగ్ చద్దా” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేశాడు. తాజాగా నాగ చైతన్య పిక్ ఒకటి ఈ సినిమా సెట్స్…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేతినిండా సినిమాలు ఉన్న టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అతను తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన సాయి పల్లవితో జంటగా నటించిన “లవ్ స్టోరీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది విడుదల కానున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ “థాంక్స్” మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” చిత్రీకరణలో ఉన్నాడు.…
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 16న విడుదలకావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వాయిదా పడిన సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో లవ్ స్టోరీ కూడా ఆగస్టు…
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ మేకోవర్, సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్ కోసమే ఇలా చెమటలు చిందిస్తున్నాడు. బీస్ట్ మోడ్…