బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ మేకోవర్, సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్ కోసమే ఇలా చెమటలు చిందిస్తున్నాడు. బీస్ట్ మోడ్ లో భారీ వర్కౌట్లు చేస్తున్న చై నెక్స్ట్ మూవీలో ఎలా కన్పించబోతున్నాడో అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ వీడియో.
Read Also : నాని రిస్క్ చేయనంటున్నాడా ?
Also Read
- Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
ప్రస్తుతం ఈ మిస్టర్ కూల్ నటించిన “లవ్ స్టోరీ, థాంక్యూ” చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన “లవ్ స్టోరీ” ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల ఆగిపోయింది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక “థాంక్యూ” చిత్రం ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ను దిల్ రాజు నిర్మిస్తుండగా… చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ “బంగార్రాజు”లో నాగ చైతన్య నటించనున్నారు. అయితే ఈ చై ట్రై చేస్తున్న సరికొత్త లుక్ దీనికోసమేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!