సెప్టెంబర్ విజేత ‘లవ్ స్టోరీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆగస్ట్ లో సినిమాలు థియేటర్లలో విడుదల కావడం మొదలైంది. ఆ నెలలో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజ రాజ చోర’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలను ప్రేక్షకులు కాస్తంత ఆదరించారు. అయితే…. అసలైన ఊపు సెప్టెంబర్ మాసంలో వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో అనువాద చిత్రాలతో కలిసి ఏకంగా 31 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు 20 కాగా, వివిధ భాషల నుండి అనువాదమైన సినిమాలు 11. సెప్టెంబర్ ఫస్ట్ వీకెండ్ లో మొత్తం ఏడు సినిమాలు విడుదల కాగా… అందులో కాస్తంత చెప్పుకోదగ్గది అవసరాల శ్రీనివాస్ నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ మాత్రమే. అనువాద చిత్రాలలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -9, షేంగ్ ఛీ’ విడుదలైనా… కమర్షియల్ గా ఈ వారం ఆహా అనిపించిన సినిమా ఒక్కటీ లేదు. ఇక సెకండ్ వీకెండ్ లో మొత్తం ఏడు సినిమాలు విడుదలయ్యాయి. నాని నటించిన ‘టక్ జగదీశ్’ ఓటీటీ ద్వారా జనం ముందుకు వచ్చింది. కానీ ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ టార్గెట్ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. ఇదే వారం వచ్చిన గోపీచంద్ ‘సీటీమార్’ మూవీ కమర్షియల్ హంగులతో ఫర్వాలేదనిపించింది. అనువాద చిత్రం ‘తలైవి’ ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ పరంగా మెప్పించినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది.
మూడో వారాంతంలో బాక్సాఫీస్ బరిలో ఏకంగా 9 సినిమాలు సందడి చేశాయి. అందులో ఆరు స్ట్రయిట్ తెలుగు సినిమాలు కాగా మిగిలినవి అనువాద చిత్రాలు. సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక నితిన్ ‘మాస్ట్రో’ ఓటీటీలో విడుదలైంది కాబట్టి దాని కలెక్షన్లను చెప్పలేని పరిస్థితి. ఈ వారం వచ్చిన విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోనీ అనువాద చిత్రాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఫోర్త్ వీకెండ్ లో రెండు అనువాద చిత్రాలతో కలిపి మొత్తం ఐదు సినిమాలు విడుదల అయ్యియి. దానిలోని ‘లవ్ స్టోరీ’ విడుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ఓవర్సీస్ లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ తొలి వారాంతానికి వరల్డ్ వైడ్ 40 కోట్లకు పైగా నెట్ వసూళ్ళు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పాటే వచ్చిన సినిమాలేవీ తమదైన ముద్రను వేయలేకపోయాయి. ఇక సెప్టెంబర్ నెలాఖరులో వచ్చిన మచ్ అవైటెడ్ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ సైతం బాండ్ అభిమానులను నిరాశకు గురిచేసింది. మొత్తం మీద సెప్టెంబర్ మాసంలో 31 చిత్రాలు విడుదల కాగా… కలెక్షన్ల పరంగా ‘లవ్ స్టోరీ’ మూవీ అగ్రస్థానంలో నిలిచింది.
Also Read
- Ram Charan: 'చిరు లీక్స్' లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
- Ram Charan: నా మూవీ కన్నా.. ‘ఇట్లు అర్జున’ బిగ్ హిట్ అవ్వాలి!
- Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. 'వారణాసి' థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
- Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! 'రామాయణ'ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
తాజావార్తలు
-
Suresh Raina on Retirement: నన్ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పలేదు.. కోహ్లీ, కోచ్‌పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..!
-
Kaleshwaram Temple: భక్తులకు ముఖ్య గమనిక.. లక్షపత్రి పూజలు రద్దు, డిసెంబర్ 8 వరకు ప్రత్యేక పూజలు!
-
Kadem Project: ఫలించిన రైతుల పోరాటం.. 700 క్యూసెక్కుల నీరు విడుదల!
-
AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 30కి పైగా అంశాలపై ఫోకస్..!
-
Karthika Masam 2026: రాజన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు.. నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!