యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడాయన మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి వార్ మూవీ “లాల్ సింగ్ చద్దా” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేశాడు. తాజాగా నాగ చైతన్య పిక్ ఒకటి ఈ సినిమా సెట్స్ లో నుంచి బయటకు వచ్చింది. ఇందులో చైతన్య మిలటరీ డ్రెస్ లో కాకుండా బ్లూ టీ షర్ట్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నాగచైతన్యకు బాలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.
Read Also : మహేష్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ధమాకా
మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు నాగచైతన్య ఖాతాలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ, “లాల్ సింగ్ చద్దా”తో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రానున్న ఓ వెబ్ సిరీస్, మరో వెబ్ మూవీ ఉన్నాయి.