(అక్టోబర్ 11న ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’కి 25 ఏళ్ళు)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు రామలింగయ్య సమర్పణలో అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ నాయికగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నతమ్ముడుగా కళ్యాణ్ ఈ సినిమాతో పరిచయం కావడం చిరు అభిమానులకు మహదానందం కలిగించింది. పైగా…