కరోనా సెకండ్ వేవ్ తరువాత పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రిలీజ్ డేట్లను కూడా ప్రకటించాయి. అయితే సీనియర్ హీరోల చిత్రాలైన ఆచార్య, అఖండ మాత్రం ఇంకా విడుదల తేదీలను ఖరారు చేయలేదు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “అఖండ” అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. “ఆర్ఆర్ఆర్” ఇప్పటికే ఈ డేట్ ను లాక్ చేసినప్పటికీ ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి బాలయ్య అదే రోజున…
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా ఈ డిసెంబర్ లో రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యాడు. రా ఏజెంట్ గా పాత్రలో పరకాయ ప్రవేశం చేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఏజెంట్’ గా అతని లుక్ అందరినీ ఆకట్టకుంది. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అనిపించుకుంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.…
‘అందాల రాక్షసి’ తో తొలిసారి మెగా ఫోన్ పట్టిన హను రాఘవపూడి ఇంతవరకూ తన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అయితే వేసుకోలేదు. ఆ తర్వాత నానితో తెరకెక్కించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా ఫిల్మ్ మేకర్ గా హను రాఘవపూడికి మంచి గుర్తింపే వచ్చింది. ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా…
సినిమా రంగంలో వారసులదే హవా అని చాలామంది భావిస్తారు. కానీ ఆ వారసులు సైతం ప్రతిభ లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద నిలబడలేరు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి, విజయతీరాలను చేరుకోవడానికి నిరంతరం వీళ్ళూ శ్రమించాల్సిందే. స్టార్స్ కొడుకులుగా వీళ్ళకు ఎంట్రీ సులువుగా ఉంటుందేమో కానీ తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తవాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే నట వారసులపై అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అవి వరం గానే కాకుండా ఒకోసారి శాపంగానూ…
అఖిల్ అక్కినేని 5వ చిత్రంగా “ఏజెంట్” రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో దర్శనం ఇవ్వనున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ యంగ్ హీరోను ఇంతకుముందెన్నడూ ప్రేక్షకులు చూడని స్టైలిష్ లుక్ లో చూపించనున్నారు. అక్కినేని అభిమానులను థ్రిల్ చేయడానికి “ఏజెంట్” ఫస్ట్ లుక్ ను అఖిల్ పుట్టినరోజున విడుదల చేయబోతున్నారు. Read Also : పోలీసులను ఆశ్రయించిన సీనియర్ హీరో ఇక తాజాగా అఖిల్…
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు దీన్ని జనం ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు తహతహ లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ స్టార్…
కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర టాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రలోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో దేవరాజ్ పాత్రలో మెప్పించిన ఉపేంద్ర, ప్రస్తుతం ‘గని’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అక్కినేని అఖిల్ కొత్త సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఉపేంద్రను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ డిఫరెంట్ లుక్ కనిపించనున్నాడు. కరోనా…
హీరోగా అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. మ్యూజికల్ గా ఆ సినిమాలు కాస్తంత గుర్తింపు తెచ్చినా కాసుల వర్షం కురిపించలేదు. ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్పైనే అఖిల్, అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైతం ఏజెంట్గా యాక్షన్, థ్రిల్లర్ మూవీతో అఖిల్ ను కొత్తగాచూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు మీద అఖిల్…
అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ఇక తాజాగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న అఖిల్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ డాషింగ్ లుక్ లో కన్పిస్తున్న పిక్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. గడ్డం, జుట్టుతో అఖిల్ కొత్త…