అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగ చైతన్య మాట్లాడుతూ అక్కినేని అభిమానులపై ప్రేమను కురిపించారు.
Read Also : సమంతను కాదు కుక్కను అన్నా : సిద్ధార్థ్
ఈవెంట్ లో చైతన్య మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులంతా ఎలా ఉన్నారు? రోజులు, పరిస్థితులు మారతాయి. కానీ మీ ఎనర్జీ మాత్రం అస్సలు మారదు. నాకు మిమ్మల్ని మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అరవింద్, బన్నీ వాసు నాకు చాలా స్పెషల్. వాసు నా మొదటి సినిమా చేశారు. ఆ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతోనే ‘100% లవ్’ చేశాను. ఆయన ముందుగా కథను నమ్ముతారు. నీ ఏవీ చూసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. అరవింద్ గారి విషయానికొస్తే… చాలామంది చెప్పారు అరవింద్ స్క్రిప్ట్ ఓకే చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని. అది అలాగే ఉండాలి. ఒక సక్సెస్ సినిమాను చేయాలంటే ఖచ్చితంగా అలాగే కేర్, ఫ్యాషన్, డెడికేట్ ఉండాలి. ఆయనకు ఒక పెద్ద ఓటిటి ప్లాట్ఫారం ఉన్నప్పటికీ తన సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనీ ఇన్ని రోజులు హోల్డ్ చేయడం గొప్ప విషయం” అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.