ప్రపంచంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. గ్లోబలైజేషన్ కారణంగా ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. వేగంగా ప్రయాణాలు చేయడం కోసం విమానాలు ఎక్కేస్తున్నారు. ఎయిర్‌పోర్టుల వినియోగం పెరిగిపోతున్నది. కొన్ని దేశాల్లో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నది. అయితే, విమానాశ్రయాలను అన్ని ప్రాంతాల్లో నిర్మించడం కుదరని పని. రన్‌వే ఉండాలి. విమానాశ్రయానికి దగ్గరగా పెద్ద పెద్ద బిల్డింగులు ఉండకూడదు. కొన్ని చోట్ల నిర్మించే ఎయిర్‌పోర్ట్‌లు అందర్ని ఆకట్టుకుంటున్నాయి.…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 వ తేదీనుంచి ఆగస్టు 30 వ తేదీ వరకు అమెరికన్ ఆర్మీ కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నది. ఆగస్టు 31 నుంచి తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి కమర్షియల్ విమానాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాలేదు. కాగా, ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఇందులో 10 మంది వరకు ప్రయాణికులు…
ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను ఆమెరికా పూర్తిగా ఖాళీచేసి వెళ్లిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా ఖాళీచేసింది. చివరి సైనికుడితో అంతా ఎయిర్‌పోర్ట్‌ను వదలి వెళ్లిపోయారు. అనంతరం తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనంలోకి తీసుకున్నారు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ కేరింతలు కొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. తాలిబన్ నేతలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారు. ఎయిర్‌పోర్ట్ మొత్తం కలియదిరిగారు. దేశంలోని ప్రజలందరినీ క్షమించేశామని, పౌరులను భద్రంగా…
బాల్యంలో మనల్ని ప్రభావితం చేసే అంశాలే వారి జీవితాల్ని నిర్ధేశిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల జీవన విధానం ఎలా మారిపోయిందో చెప్పక్కర్లేదు. తాలిబన్లనుంచి తప్పించుకొని పొట్ట చేతపట్టుకొని పిల్లలతో కలిసి దొరికిన విమానం పట్టుకొని శరణార్ధులుగా వివిధ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆఫ్ఘనిస్తానీయులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల్లో బెల్జియం కూడా ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక మంది శరణార్ధులుగా బెల్జియంకు వెళ్తున్నారు. అక్కడ ఆర్మీ ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో నివశిస్తున్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెల్జియం చేరుకున్న ఓ చిన్నారి…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబూల్‌లోకి తాలిబన్లు చొచ్చుకొస్తున్నారని వార్తలు అందటంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమయ్యాయి. వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. ద దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే,…
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనతో విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర హై అలెర్ట్ కొనదగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకారణకు వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రికి వినతులు సమర్పించాలని జెఏసీ నిర్ణయం తీసుకుంది. వందల సంఖ్యలో ఎయిర్ పోర్ట్ దగ్గరకు కార్మికులు వస్తారని ముందస్తు సమాచారం రావడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇక అక్కడికి వచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ముందస్తు అనుమతి లేకపోవడంతో ఎయిర్ పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరే అడ్డగిస్తున్నారు. విశాఖ…
డ్రగ్స్ రవాణాలో ఇప్పుడు ఏకంగా విమానాలను ఉపయోగిస్తున్నారు కేటుగాళ్లు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో సారి భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. డర్బన్ నుండి ఢిల్లీ వచ్చిన టాంజానియా దేశస్తుడి నుండి 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.. హెరాయిన్ డ్రగ్‌ను హాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి అందులో నింపాడు కేటుగాడు. ఢిల్లీ విమనాశ్రయంలో ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని లగేజ్ బ్యాగ్‌ను క్షుణంగా తనిఖీ చేసింది…
విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుండటంతో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవలే చెన్నై, హైదరాబాద్‌లో విదేశీ బంగారం భారీగా బయటపడింది. ఇప్పుడు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారాన్ని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. షార్జా నుంచి కేరళ వచ్చిన ముగ్గురు లేడీ ప్రయాణికుల వద్ద నుంచి దాదాపు రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టుగా మార్చి ఆ పేస్టును క్యాప్సుల్స్ లో నింపి, వాటిని మలద్వారంలో…
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. అఫ్రికాలోని జాంబియా, ఉగాండా దేశాల నుంచి వచ్చిన మహిళల నుంచి రూ.78 కోట్ల రూపాయల విలువైన 12 కిలోల హెరాయిన్‌ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసులకున్నారు. జోహెన్నస్ బర్గ్ నుంచి దోహామీదుగా హైదరాబాద్‌కు చేరుకున్న ఈ మహిళల నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్ స్వాదీనం చేసుకున్న అధికారులు, ఆ డ్రగ్ ను ఎవరికి సరఫరా చేస్తున్నారనే విషయంపై దృష్టిసారించారు. సూట్‌కేసుల పైపుల మధ్యలో ఉంచి ఈ డ్రగ్స్‌ను స్మగ్లింగ్…