Gannavaram Airport: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో గల గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం వాతావరణంలో వ్యాపించిన దట్టమైన పొగ మంచు కారణంగా అరగంటకు పైనే గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
గాల్లో ఎగిరే కార్లు తయారు చేస్తున్నారు. అలాంటి కార్లు మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కార్లు గాలిలో ఎగరడం కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
అగ్రరాజ్యమైన అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సిస్టమ్‌లో భారీ సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయని బుధవారం వార్తా నివేదికలు వెల్లడించాయి.