విమానాలు ఆకాశంలో ఎగిరినట్లు.. కార్లు కూడా ఎగరగలవా..!. పిచ్చి కానివ్వండి కార్లు గాల్లో ఎందుకు ఎగురుతాయి. ఏదో సినిమాలో మాత్రమే అలా సాధ్యమవుతుంది. ఐతే ఇప్పుడున్న టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుండటంతో.. గాల్లో ఎగిరే కార్లు తయారు చేస్తున్నారు. అలాంటి కార్లు మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కార్లు గాలిలో ఎగరడం కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
Extramarital Affair: పరాయి వ్యక్తితో భార్య ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
ఆ వీడియోలో రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం చూడవచ్చు. ఇంతలో రెండు కార్లు జీబ్రా క్రాసింగ్ దగ్గరకు రాగానే హఠాత్తుగా గాలిలోకి లేచాయి. ఇది చూసి వెనుక నుంచి వస్తున్న కారు ఒక్కసారిగా ఆగింది. అది రియాలా.. లేదంటే ఫేక్ అనేది తెలియదు. అయితే ఆ వీడియోను షేర్ చేసిన వినియోగదారుడు కూడా షాక్ అయ్యి ‘ఆఖిర్ యే హో క్యా రహా హై?’ అని క్యాప్షన్ లో పెట్టాడు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు దెయ్యం సినిమాల్లో కనిపిస్తాయి. దెయ్యాలు వాటంతట అవే గాలిలో ఎగురుతాయి. అయితే ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు ఫేక్ అని అంటున్నారు.
Krithi Shetty : తడిచిన అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి..
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కారయోలు అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 9 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు చూశారు. అంతేకాకుండా లక్ష మందికి పైగా వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై
పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ‘భయపడకండి…కారు ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ చేయబడింది’ అని సరదాగా రాస్తే, ‘ఇది ఎవరో తండ్రి అద్భుత మాయాజాలం అని నేను భావిస్తున్నాను’ అని మరొక వినియోగదారు రాశారు.