Gold : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో బంగారం భారీగా పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టాయిలెట్ నుంచి సుమారు 2 కోట్ల విలువైన నాలుగు బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.