Hoax Bomb Threats: వరసగా నకిలీ బాంబు బెదిరింపులు ఇండియా విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. భారత విమానయాన రంగాన్ని నష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఈ నకలీ బెదిరింపుల వల్ల ఏయిర్‌లైన్ సంస్థలు కోట్లలో నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని బెదిరింపులు లండర్, జర్మనీ నుంచి వచ్చాయని తెలుస్తోంది. కావాలనే భారత విమానాలను టార్గెట్ చేస్తు్న్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Air India: వరస బాంబు బెదిరింపుల ఘటనలు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వరసగా నాలుగో రోజు కూడా బాంబు బెదిరింపు వచ్చాయి. ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కి కొన్ని గంటల ముందు ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ని పంపించినట్లు ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 గురువారం తెలిపింది. విమానం ‘‘స్క్వాకింగ్ 7700’’ కోడ్‌ని పంపించింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది.
Air India: ఆన్‌లైన్‌లో బెదిరింపులు రావడంతో న్యూఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్‌ని కెనడాలోని ఇకల్యూబ్ ఎయిర్‌పోర్టుకి మళ్లించారు.
Air India: దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించిందని ఎయిర్ ఇండియా ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి, ప్రయాణికుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో వడ్డించిన ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది. నేను దీన్ని చూసినప్పుడు నా 2 సంవత్సరాల పిల్లవాడు ఆమ్లెట్ సగం తిన్నాడు. దీంతో చిన్నారికి ఫుడ్ పాయిజన్ అయిందని వాపోయారు. Tirupati Laddu…
Air India: ఎయిర్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి పలు కొత్త మార్గాలలో విమాన సర్వీసులను స్టార్ట్ చేసింది. వీటిలో విజయవాడ-బెంగళూరు, హైదరాబాద్- గౌహతి, బెంగళూరు- ఇండోర్ లు ఉన్నాయి.
Vistara – Air India Merge: సింగపూర్ ఎయిర్ లైన్స్ విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేసే ప్రతిపాదనలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) కోసం భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీనితో పాటు, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలీనం పూర్తవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ విలీనంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటాను పొందనుంది. Mathu Vadalara 2 Teaser:…
ఓ యువతి విమానంలో తన బాయ్ ఫ్రెండ్ కి రొమాంటిక్ గా ప్రపోజ్ చేసింది. ఎయిర్ ఇండియా విమానంలో ఆ మహిళ ప్రపోజ్ చేసిన వీడియో... ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా అబ్బాయిలు తమ గర్ల్‌ఫ్రెండ్స్ కోసం ఇలాంటివి చేస్తుంటారు.
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొరడా ఝుళిపించింది. శుక్రవారం భారీ మొత్తంలో జరిమానా విధించింది. రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకు ఎయిరిండియా సంస్థకు రూ.90 లక్షల జరిమానాను విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది.