నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను మరో సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం అయ్యిందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించినా.. ఎక్కువ సంస్థలు మాత్రం పోటీ పడింది లేదు.. ఈ దశలో చివరి వరకు నిలిచింది మాత్రం టాటా గ్రూపే.. దీంతో.. టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా వెళ్లిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.. ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని అయినట్టువంటి టాటా గ్రూప్ చేతికి వెళ్లిందనేది…