Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..
- పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం..
- గో-అరౌండ్ ప్రక్రియ సమయంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపు పాకిస్తాన్ గగనతరంలోకి ప్రవేశించింది. ఈ ఘటన జూన్ 22న జరిగింది. అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే ముందు విమానం ‘‘గో-అరౌండ్’’ ప్రక్రియలో భాగంగా అటారీ సరిహద్దును దాటినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ డేటా ప్రకారం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI479 రెండు నిమిషాల పాటు పాకిస్తాన్ గగనతలంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్‌లు ఒకరినొకరు తమ గగనతలాన్ని మూసివేస్తున్నన్న విషయం తెలిసిందే.
ఎయిర్‌బస్ A321 విమానం ఢిల్లీ నుంచి రాత్రి 9:18 గంటలకు బయలుదేరి, అమృత్‌సర్‌లో రాత్రి 10:30 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అమృత్సర్ విమానాశ్రయంలో అధికా ఎయిర్ ట్రాఫిక్, ఆపరేషనల్ కారణాల వల్ల ల్యాండింగ్ అనుమతి రాలేదు. ఆ తర్వాత అమృత్సర్ విమానాశ్రయంలో కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ఆ విమానాన్ని ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీని తర్వాత ఢిల్లీ చేరుకున్న విమానానికి సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత మళ్లీ అదే విమానాన్ని అమృత్సర్ పంపించారు. చివరకు మంగళవారం తెల్లవారుజామున 2.20 గంటలకు అక్కడ ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు దాదాపుగా 4 గంటల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు.
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
విమానం తమ గగనతలంలోకి వచ్చిననట్లు గమనించిన పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఈ విషాయాన్ని వెల్లడించి అప్రమత్తం చేసింది. దీంతో వెంటనే విమానం తిరిగి భారత్ ఎయిర్ స్పేస్‌లోకి వచ్చింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘జూన్ 22న ఢిల్లీ-అమృత్సర్ AI479 విమానం గో-అరౌండ్ ప్రక్రియలో భాగంగా కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలాన్ని ఉల్లంఘించింది. ఈ విషయాన్ని సంబంధిత నియంత్రణ సంస్థలకు తెలియజేశాం. ప్రస్తుతం అంతర్గత విచారణ కొనసాగుతోంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా అత్యున్నత ప్రాధాన్యత’’ అని పేర్కొంది.
తాజావార్తలు
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!