Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్‌లైన్స్ హెచ్చరిక..
- ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి..
- ఇంధన ధరల పెరుగుదలతో సంక్షోభంలో దేశ విమానయాన పరిశ్రమ..
- భారీగా నష్టాలు వస్తాయని విమాన సంస్థల ఆందోళన..
- కేంద్రానికి ఎయిర్ ఇండియా లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airlines Crisis: ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం భారత విమానయాన రంగాన్ని సంక్షోభానికి గురిచేస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల మూలంగా ఎయిర్‌లైన్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యలో ఇంధన ధరల కారణంగా విమాన కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా సహా కనీసం మూడు ఎయిర్‌లైన్స్ ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నాయి. విమాన ఇంధనం ‘‘ఏవియేషణ్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలను సవరించాలని కోరాయి. విమాన కార్యకలాపాల ఖర్చులో 40 శాతం ఖర్చు ఇంధనానిదే ఉంటుంది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులలో ఇది 55–60% వరకు పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన ధరలు ప్రస్తుతం ప్రతీ కిలోలీటర్ కు రూ. 2 లక్షలకు పైగా చేరాయి.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ఈమేరకు విమాన సంస్థలు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. ఇంధన ధరలు పెరిగితే ఎయిర్‌లైన్స్ భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఫ్లైట్లను రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, స్పైస్ జెట్ కేంద్రానికి లేఖ రాశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రూట్లపై ప్రభావం ఎక్కువగా ఉందని, ఇలాగే కొనసాగితే రూట్లలో ఫ్లైట్లను నిలిపేయడం లేదా తగ్గించడం చేయాల్సి వస్తుందని ఎయిర్‌లైన్స్ చెబుతున్నాయి.
దేశీయ, అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలు సమానంగా ఉండాలని, తాత్కాలికంగా 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని వాయిదా వేయాలని, కొన్ని ప్రాంతాల్లో 25 శాతం వరకు ఉండే రాష్ట్ర స్థాయి వ్యాట్‌ను తగ్గించాలని, ఇంధన ధరల పెరుగుదలపై నియంత్రణ ఉండాలని కొన్ని కీలక డిమాండ్లు చేశాయి. ఇరాన్ యుద్ధం వల్లే ఈ ఇంధన ధరల పెరుగుదల నమోదవుతోంది. ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని అడ్డుకోవడంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి వచ్చే చమురుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలో చమురు, గ్యాస్ రవాణా 20 శాతం జరుగుతోంది.
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!