Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తమ ప్రయాణికులకు షాక్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో తన దేశీయ విమాన సర్వీసులను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియా తన దేశీయ సర్వీసులలో ఏకంగా 20 నుంచి 22 శాతం వరకు విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ, ఇప్పటికే తన అంతర్జాతీయ సర్వీసులను కూడా దాదాపు 27 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా నెట్వర్క్ పరిధిని పరిశీలిస్తే, సంస్థ ప్రతి వారం దాదాపు 4,400 విమాన సర్వీసులను నడుపుతోంది. దేశీయ సర్వీసులు వారానికి సుమారు 3,600 విమానాల, అంతర్జాతీయ సర్వీసులు వారానికి సుమారు 800 విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుత నిర్ణయం ప్రకారం.. వారానికి నడిచే 3,600 దేశీయ విమాన సర్వీసులలో సుమారు 22 శాతం వరకు కోత పడనుంది.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన..
ఈ తాత్కాలిక మార్పులపై ఎయిర్ ఇండియా బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్, ఆగస్టు 2026 మధ్య కాలానికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులలో కొన్ని సర్దుబాట్లు చేశామని, దానికి కొనసాగింపుగానే ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా కార్యకలాపాలను తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తున్నామని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన కొన్ని నిర్దిష్ట మార్గాలలో మాత్రమే విమానాల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా యాజమాన్యం పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక, మార్కెట్ డిమాండ్, నిర్వహణ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ.. రద్దు చేసిన విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఇండిగో సంస్థ కూడా జూన్ 1 నుంచి తమ దేశీయ సర్వీసులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంధన ధరల పెరుగుదల, ప్రయాణికుల డిమాండ్ తగ్గడమే దీనికి ప్రధాన కారణాలు. ఇండిగో 5-7 శాతం మేర సర్వీసులను కోత విధించనుంది. ఈ నిర్ణయం వల్ల ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి పలు ప్రధాన నగరాల మధ్య నడిచే విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతే కాకుండా.. విమాన ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!