Assam Congress: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌ను నియమించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా తెలియజేశారు.
AICC: పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా కొనసాగుతున్న దీపాదాస్ ను తొలగించిన ఏఐసీసీ.. తెలంగాణకు కొత్త ఇంచార్జిని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీనాక్షి నజరాజన్ 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ లోక్ సభ నుంచి ఎంపీగా…
TG Congress Delhi Tour: తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేబినెట్ విస్తరణ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశమవుతున్నారు. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన…
CM Revavnth Reddy : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డి (MCHRD)లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ (AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.…
తెలంగాణ కాంగ్రెస్‌ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ... దగ్గరుండి వాటిని పరిష్కరించాల్సిన ఎఐసిసి నాయకులు మాత్రం పత్తా లేకుండా పోయారట. పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని, ఓ మంత్రిని రోడ్డుకీడ్చే పని చేశారన్న ప్రచారం జరుగుతున్నా... అసలు అందులో వాస్తవం ఎంత? ఏం జరిగిందన్న సంగతిని పట్టించుకునేవాళ్ళే లేకుండా పోయారన్న టాక్ నడుస్తోంది పార్టీ వర్గాల్లో.
Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. ఇదివరకు బీఆర్ఎస్‌కు ఈ ప్రాంతం…
జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్ మాట్లాడుతూ.. నాకు రెండు కలలు ఉన్నాయి.. ఒకటి జైన డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇంకోటి డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు.
Congress: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కేపీసీసీ అధ్యక్షు పదవీపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి అక్కడ కనపడటం లేదు.
Ponnam Prabhakar : ఈనెల 16 న గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా , బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 16 వ తేదీ సోమవారం రోజున గాంధీ భవన్ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి…
అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించండి... ఇండియా కూటమి అభ్యర్థులను తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.