టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతున్నారని.. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం పేరు పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ ఫ్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ…