Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా అంటే భారీ బడ్జెట్, భారీ బిజినెస్, అంతకంటే భారీ రెమ్యునరేషన్ అనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. ఒక్కో సినిమాకు రూ.120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే స్టార్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ మూవీకి రెమ్యునరేషన్ దాదాపు రూ.70 కోట్లకే అంగీకరించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా తన మార్కెట్ కు తగ్గట్టే పారితోషికం తీసుకునే సల్మాన్ ఈసారి ఎందుకు తగ్గించుకున్నరు అనే చర్చ కూడా మొదలైంది. అయితే అసలు విషయంలోకి వస్తే దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న SVC 63 చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ 2027 ఈద్ సందర్భంగా విడుదల కానుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచే దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా కంటే ముందుగా సల్మాన్ తీసుకుంటున్న పారితోషికం గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ సుమారు రూ.70 కోట్ల పారితోషికాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇది ఆయన రెమ్యునరేషన్‌తో పోలిస్తే దాదాపు రూ.50 కోట్ల తేడా. ఇంత తగ్గింపుకు కారణం కేవలం సినిమా బడ్జెట్ కాదని, వ్యక్తిగత అనుబంధమే ప్రధాన కారణమని ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను సెటప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత రఫీ కాజీతో సల్మాన్‌కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. వ్యాపార లాభాల కంటే వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా సల్మాన్‌కు ఉన్న పేరును ఈ నిర్ణయం మరోసారి గుర్తు చేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
అయితే ఇది సల్మాన్ కెరీర్లో మొదటిసారి జరిగిన విషయం కాదు. గతంలో కూడా ఆయన పలు సినిమాల్లో రెమ్యునరేషన్ తీసుకోవడం బదులుగా లాభాల్లో వాటా, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకునే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే సన్నిహితుల కోసం ప్రత్యేక పాత్రల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రూ.70 కోట్ల రెమ్యునరేషన్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక 2027 ఈద్ సందర్భంగా విడుదల కానున్న SVC 63పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం, సల్మాన్ ఖాన్ క్రేజ్ కలిసి ఈ సినిమాను బాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల జాబితాలో నిలిపాయి. ఇప్పుడు పారితోషికం అంశం కూడా చర్చనీయాంశం కావడంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.
- Tags
- cinema
- Salman Khan
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!