India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత కాలిక్యులేటెడ్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతని ఎడమ మోకాలినొప్పి సమస్య ఇంకా తగ్గకపోవడంతో శ్రీలంక పర్యటనకు వెళ్లడం లేదని సమాచారం. అంతకుముందు శ్రీలంక పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే లంకకు వెళ్తాడని సెలెక్టర్లు ముందే స్పష్టం చేశారు. ఇక, భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంకకు పయనం కానుంది. అంతకంటే ముందే బుమ్రా ఈ సిరీస్‌కు దూరం కావడం టీమిండియాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం.
BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాథమిక తనిఖీల్లోనే బుమ్రా ఎడమ మోకాలికి సంబంధించిన సమస్య బయటపడింది. దీంతో వైద్య బృందం అతన్ని శ్రీలంకకు పంపడానికి బదులుగా పూర్తిస్థాయి కోలుకోవడానికి (రికవరీ) విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. బుమ్రా విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని సూచించారట. ఈ ఏడాది భారత జట్టుకు ఎంతో కీలకమైన సిరీస్‌లు ఉన్నాయి. రాబోయే ఏషియన్ గేమ్స్, న్యూజిలాండ్ పర్యటన, ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలలో టీమిండియాకు బుమ్రా సేవలు అత్యంత అవసరం. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి బుమ్రా తప్పుకోవడంతో, అతని స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుతం జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఆకిబ్ నబీ పేరు ఈ రేసులో అందరికంటే ముందుంది. ఆకిబ్ నబీ జమ్మూ కశ్మీర్ తరఫున డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేయడమే కాకుండా, ఇటీవల ఇండియా-ఎ తరఫున శ్రీలంక పర్యటనలో ఆడిన రెండు రెడ్ బాల్ మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
Also Read
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
తాజావార్తలు
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!