Air India crash Investigation: గత వారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని డాక్టర్స్ హాస్టల్‌పై కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 270 మంది మరణించారు. అయితే, ప్రమాదానికి రెండు ఇంజన్లు పనిచేయకపోవడం కారణమని పలువురు భావిస్తున్నారు. ఇంజన్ ఫెయిల్యూర్‌తో పాటు విద్యుత్ లేదా హైడ్రాలిక్స్ పనిచేయదని అంచనా వేస్తున్నారు.
అయితే, జూన్ 12న విమాన క్రాష్ అవుతున్న సమయంలోని వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఈ వీడియోల్లో విమానం కింద ‘‘రామ్ ఎయిర్ టర్బైన్ లేదా RAT’’ బయటకు రావడం కనిపించింది. ఇది రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు, విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు, విమానంలోని కీలక పరికరాలకు విద్యుత్ అందించేందుకు విమానం నుంచి RAT బయటకు వస్తుంది. చిన్న ఫ్యాన్ లా ఉండే ఈ పరికరం జనరేటర్ గా పనిచేస్తూ, విద్యుత్‌ని అందిస్తుంది.
Read Also: Karnataka: కొడుకు అల్లరి భరించలేక ఇనుప కడ్డీతో వాతలు పెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..?
విమానం జెట్ ఇంజన్ల శబ్ధం లేని సమయంలో RAT వేగం తిరుగుతున్నప్పుడు వస్తున్న సౌండ్ క్లియర్‌గా ఆడియో క్లిప్పు్ల్లో వినిపిస్తుంది. దీనిని బట్టి విమానం ఎత్తును అందుకునేందుకు కష్టపడుతుందని తెలుస్తోంది. RAT అత్యవసర శక్తిని ఉత్పత్తి చేయడానికి గాలి వేగాన్ని ఉపయోగిస్తుంది. సాధారణంగా రెండు ఇంజన్లు విఫలమైనప్పుడు, ఎలక్ట్రానిక్ వైఫల్యం లేదా హైడ్రాలిక్స్ వైఫల్యం సమయంలోనే ఇది విమానం నుంచి బయటకు వస్తుంది.
‘‘విమానం ఆకస్మికంగా గింగిరాలు తిరగలేదు. పక్షులు రెండు ఇంజన్లను ఒకే సారి ఢీకొట్టలేదు. ఇంజన్ల నుంచి మంటలు రాలేదు. కాబట్టి రెండు ఇంజన్ల ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఒక శబ్ధం విన్నానని చెప్పాడు. ఇది RAT విమానం నుంచి బయటకు రావడం కావచ్చు. అతను ఎరుపు, నీలం లైట్లను చూశాడు. ఇది అత్యవసర విద్యుత్ కనెక్టింగ్, అత్యవసర లైట్లు ఆన్ కావడం కావచ్చు.’’ అని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు.
విమానం ముందుగా బాగానే పైకి వెళ్లింది. అయితే, అది ఎత్తును కొనసాగించ లేకపోయింది. దీనిని చూస్తే రెండు శక్తుల్ని కోల్పోయింది. తక్కువ వేగం, విమాన లిఫ్ట్(పైకి ఎగరడానికి కారణమయ్యే శక్తి)ని కోల్పోయింది. రెండు ఇంజన్లు విఫలం, హైడ్రాలిక్స్ లేదా ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ సమయంలోనే RAT విమానంలో డిప్లాయ్ అవుతుందని ఆయన నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ ఇంజన్ల షట్‌డౌన్‌కి దారి తీయొచ్చని మరికొందరు చెబుతున్నారు. ‘‘రెండు ఇంజన్లు ఒకే సారి, ఒకే సమయంలో షట్ డౌన్ అయ్యాయి. అంటే ఇది సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవడం వల్ల జరగొచ్చు. ఎలక్ట్రిక్ వైఫల్యం వల్ల ఇది సెన్సార్ల నుంచి తప్పుడు సిగ్నల్స్ ద్వారా ఇంజన్లు పనిచేసి ఉండకపోవచ్చు.’’ అని అంచనా వేస్తున్నారు.