Today Business Headlines 28-03-23: 4 ఏళ్లలో 2134 కోట్లు: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.. సీఎస్‌ఆర్.. కింద 2 వేల 134 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాయి. ఈ నిధులతో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. 2016-17వ సంవత్సరం నుంచి 2020-21వ సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న సోమవారం లోక్‌సభలో వెల్లడించింది.