మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగుచేయడం కోసం మన రాష్ట్రం లో 31 జిల్లాలకు అనుమతులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ తో పాటుగా 14 ప్రయివేటు కంపెనీలు పామాయిల్ విస్తరణ కు ముందుకొచ్చాయని, ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఆయిల్ ఫెడ్ కేంద్రం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దసరా పండుగ రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు..
కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు..
Central Cabinet Decisions: ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ రైతాంగం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతాంగం కోసం రూ.13,966 కోట్లను కేంద్రం కేటాయించింది. రూ. 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేయనుంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తూ రైతులకు మరింత మేలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రైతులు లోన్ తీసుకోవడం వచ్చే రోజుల్లో కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి కానుంది.
రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
KTR Tweet: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి గడ్డుకాలం ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంలోనే ..
రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు.. జులై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్ పుట్ సబ్సీడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని క్లారిటీ ఇచ్చారు.
మీరు గ్రామంలో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఏదైనా స్టార్టప్ పెట్టాలనుకునే వారికీ సహకరించడం కోసం 750 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటు చేస్తోంది.
రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లు అద్దెకు తీసుకొచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.