తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. పంచాంగ శ్రావణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణం ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు కనిపిస్తాయి. సంపూర్ణ వర్షాలు పడతాయి. ప్రభుత్వం పాలన చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కేంద్రం నుండి వచ్చే సహకారం కూడా తీసుకునే అవకాశం ఉండదు. పత్తి పంటలకు మంచి అవకాశం. ఎర్ర నేలలో వేసే పంటకు మంచి అవకాశం. వస్త్ర పరిశ్రమలు కొత్తగా వెలుస్తాయి అభివృద్ధి…
Svalbard Seed Vault : భూగోళంపై మనిషి ఆధిపత్యం పెరుగుతున్న కొద్దీ ప్రకృతి వ్యవస్థలు సంక్షోభంలో పడుతున్నాయి. తీరని వాతావరణ మార్పులు, ఎప్పుడెప్పుడో పుట్టుకొస్తున్న విపత్తులు, రాజకీయ ఉద్రిక్తతల వల్ల జరిగే యుద్ధాలు.. ఇవన్నీ కలిసి భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. మనం ఇప్పుడు భద్రంగా ఉన్నామనిపించినా, ఎప్పుడైనా ఒక అంతర్జాతీయ విపత్తు సంభవించవచ్చు. ఊహించండి… ఒక రోజు మీ చుట్టూ అన్నీ శూన్యం… నేలలపై పంటలు లేవు… ఆహారం దొరకని పరిస్థితి… భూమి మరో మధ్యం శతాబ్దం…
Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్ట్ మిగిలిన పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్…
నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. 50 వేల బస్తాలకు పైగా అమ్మకానికి పసుపు రావడంతో రైతులతో మార్కెట్ యార్డ్ మొత్తం సందడిగా మారింది. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
హోలీకి ముందు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త గోధుమ సేకరణ విధానాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ మద్దతు ధరను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.150 పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గోధుమ మద్దతు ధర (MSP)ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. "బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం జరిగింది. సమయానికి రైతుబంధు తో పాటు సబ్సిడీలు అందజేసి నూనె గింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సాహం కల్పించాం. సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. నాటి ప్రణాళికా బద్దంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్)…
KTR : తెలంగాణలో సాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల గత ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండిపోయాయని, సాగునీటి крైసిస్ అన్నదాతలను ఆత్మహత్యలకు దారి తీస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకునేందుకు సరిపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లను తగిన విధంగా…
టీజీ ఎప్సెట్ కోసం ఎదురుచూసే విద్యార్థులకు గుడ్ న్యూస్.ఫిబ్రవరి 20వ తేదీన టీజీ ఎప్సెట్-2025 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ – హైదరాబాద్ ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఎస్సెట్ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 25వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను ఇతర వివరాలను రేపు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో పొందుపర్చనున్నట్లు తెలిపారు.
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇకపోతే ఏ శాఖకు ఎంత బడ్జెట్ అన్న…