2022-23లో వ్యవసాయం, వేట, అటవీ మరియు చేపల వేటలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 25.3 కోట్ల స్థాయికి చేరుకుంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. గత 17 ఏళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి. FY 2022-23 మధ్య వ్యవసాయ ఉపాధి 25 కోట్లను దాటింది. అలాగే.. గత నాలుగేళ్లలో 5 కోట్ల మందికి పనులు లభించాయి. 2022-23లో వ్యవసాయ రంగంలో 48 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. తయారీ, వాణిజ్యంలో 44 లక్షలకు పైగా ఉద్యోగాలు పొందారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ రంగంపై దృష్టి సారించడం గురించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 10 లక్షల ఉద్యోగాలను అందజేస్తామని కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగా ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. దాదాపు 71 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. రోజ్‌గార్ మేళా 2023లో ప్రధాని ప్రసంగించారు.