Singireddy Niranjan Reddy: కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్ల బహిరంగసభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై నిప్పులు చెరిగారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ భవన్‌లో విసృతస్థాయి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మొండి వైఖరిని రైతులకు చెప్పాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియోను కింద ఉన్న లింక్‌లో వీక్షించండి..
దేశంలోనే తెలంగాణలో వరీ ఎక్కువ విస్తీర్ణంలో పండుతోందని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రవేశపెట్టిన రైతుసాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే తాజా ప్రధాని నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు సీతారామ ప్రాజెక్ట్ తర్వాత రైతులు ఇంకా ఎక్కువ పంట వేస్తారని, పంట కొనం అంటే రైతుల కాళ్ళు కట్టేసినట్లేనన్నారు.…
తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ కి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని… రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని… కాబట్టి ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి…
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. చదువుకున్నోళ్ళందరికీ సర్కార్ ఉద్యోగం రాదని.. హమాలీ పని చేసుకోవాలని సూచించారు. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కామెంట్స్ తప్పుగా అన్వయించారని తెలిపారు. యువత మనోభావాలను దెబ్బతీసేలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, యువత ఎవరు బాధ పడవద్దన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత ప్రిపేర్ అవ్వండి.. నోటిఫికేషన్లు రాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఏపీ-తెలంగాణ జల వివాదంపై మాట్లాడుతూ.. కేంద్రం…