Karwa Chauth: కర్వా చౌత్ ఉత్తరాది రాష్ట్రాలు నిర్వహించే ఓ హిందూ పండగ. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తుంటారు. పెళ్లి అయిన మహిళలు, తమ భర్త దీర్ఘాయుష్యు కోసం, ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకు ఎలాంటి నీటిని తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. చంద్రుడిని చూసిన తర్వాత, భర్త చేతుల మీదుగా ఉపవాసాన్ని ముగిస్తారు.
నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు ప్రకటించింది. కానీ ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది రైల్వే. జూనియర్ అధికారుల గదుల్లోని ఎయిర్ కండిషనర్లు తొలగించబడతాయని ఆ ఉత్తర్వులో తెలిపింది రైల్వే. ఉద్యోగులు తమ పని ఒత్తిడి గురించి తెలపడంతో… ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూనియర్ అధికారుల గదుల్లోని ఎయిర్ కండిషనర్లు తొలగించాలని నార్త్ సెంట్రల్ రైల్వే వివాస్పద ఉత్తర్వులు ప్రకటించింది. సెప్టెంబర్ 22న నవరాత్రి రోజున జారీ…
UP News: తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్సయిందని అతను బాధ పడుతుంటే, భార్య మాత్రం తన లవర్‌లో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని తెలుసుకున్నాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్‌లో జరిగింది. రోరావర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ శివ శంకర్ గుప్తా…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో బుధవారం ఆగ్రా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన యోగి, తర్వాత వేరే విమానంలో లక్నో చేరుకున్నారు.
Wife Harassment: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ కన్నీళ్లతో మాట్లాడుతూ.. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై తనకు అనుమానం వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె తనతో…
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక భర్త తన వికలాంగ భార్య అశ్లీల ఫొటోలు, వీడియోలను అమ్మేశాడు. భార్య నిద్రపోతుండగా.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి పోర్న్ సైట్లలో అమ్మాడని ఆరోపణలు వచ్చాయి. భర్త అదనపు కట్నం కింద రూ.10 లక్షలు డిమాండ్ చేస్తుశాడని.. భార్య డబ్బు ఇవ్వక పోవడంతో ఈ నీచమైన పని చేశాడని భార్య పేర్కొంది.
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఒక జిమ్ ట్రైన్ RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా నటిస్తూ.. భారత సంతతికి చెందిన కెనడియన్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై జిమ్ ట్రైనర్‌పై పోలీసులు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ లైంగిక దోపిడిలో నిందితడి స్నేహితుడు కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సికంద్రా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్…
Bomb Threat For Taj Mahal: ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపు మెయిల్‌ను పర్యాటక శాఖకు పంపారు. ఈ ముప్పుతో తాజ్ మహల్ చుట్టూ భద్రతను పెంచారు. మరోవైపు, తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో తాజ్ మహల్ సెక్యూరిటీ పోలీసులు, ఇతరత్రా సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెయిల్…
ప్రస్తుత రోజులలో చాలామంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తో సరదాగా గడపడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రికి రాత్రికే ఫేమస్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరికొందరు అయితే, రీల్స్ పిచ్చితో ఎంతటి సాహసానికైనా వెనక…