సికింద్రాబాద్ రైల్వేష్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు
దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్పందించారు. అగ్నివీరుల భవిష్యత్‌పై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో మనం కనిపించని శత్రువులపై యుద్ధాలు చేయాల్సిన అవసరం వస్తుందని.. ఈ నేపథ్యంలో దేశానికి యువత సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిపథ్‌ను సమర్థించిన అజిత్ ధోవల్.. యువ, సుశిక్షిత సేనలు దేశానికి అవసరమన్నారు. అగ్నిపథ్‌ను పథకాన్ని మరో కోణంలో చూడాలన్నారు. అగ్నిపథ్ అనేది 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు,…
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం విన్నవించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు కేవియట్ దాఖలు చేసింది. అగ్నిపథ్‌పై ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీశ్ అజయ్ సింగ్ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్ దాఖలు చేసి…
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసింది.. మెమోరాండం సమర్పించింది.. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసిన లేఖను కూడా ఆయన జత చేశారు. సాయుధ బలగాల రిక్రూట్‌మెంట్ విధానంలో సమూల మార్పును ప్రకటించే ముందు, ప్రభుత్వం విస్తృతస్థాయి…
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ జరిగింది.. పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసమే జరిగింది.. ఆ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయితే, కేంద్రం మాత్రం వెనక్కి తగ్గకుండా మరో ముందుడుగు వేసి నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది.. ఇక, అగ్నిపథ్‌పై ఆందోళన వ్యక్తం అవుతోన్న సమయంలో.. అగ్నిపథ్, ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతోన్న ఆందోళనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక పర్యటనలో…
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో వెనుక పడ్డామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. అగ్నిపథ్ అంటే మిలిటరీ ఉద్యోగం నాలుగేళ్లు చేయాలంట అంటూ ఆయన మండిపడ్డారు. యువతను బీజేపీని మోసం చేస్తుందని, ఓ కేంద్ర మంత్రి అంటారు కటింగ్ చేయడం నేర్పిస్తా… బట్టలు ఇస్త్రీ చేయడం నేర్పిస్తా…
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు నేడు తనిఖీలు…
అగ్నిపథ్ సమస్యగా ఎందుకు మారింది?సైన్యంకంటే ఆయుధాలే కీలకమని ప్రభుత్వం భావిస్తోందా?జీతాలు, పెన్షన్లు భారమనుకుంటోందా? సైన్యం కేవలం యుద్ధాల కోసమేనా?అగ్నిపథ్ అగ్గిరాజేసింది..ప్రభుత్వం యువతను సైన్యంలో భాగస్వాములను చేయటానికి అని చెప్తోంది.యువత మా ఉద్యోగాలను మాకివ్వాలని నినదిస్తోంది..ఇరుపక్షాల వాదనలు బలంగానే కనిపించినా, కనిపించే అంశాల వెనుక అసలు సంగతేమిటనేది కీలకంగా మారుతోంది. ఏ ఉద్యోగికైనా కొంత పని, దానికి ఆదాయం ఉంటుంది…ఆ పనికి ఉండే డిమాండ్‌ని బట్టి జీతం ఉంటుంది..ఇదే లెక్కలో చూస్తే సైన్యాన్ని కూడా ప్రభుత్వం చూస్తోందా?జనం ప్రాధాన్యత…
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ‘అగ్నిపథ్ స్కీమ్’పై స్పందించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న హింసపై విచారం వ్యక్తం చేశారు. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువతను రిక్రూట్ చేసుకోవడానికి మహీంద్రా గ్రూప్ అవకాశం కల్పిస్తుందన్నారు. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ స్వాగతం పలుకుతుందన్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఒక ట్వీట్లో “అగ్నిపథ్ పథకం నేపథ్యంలో జరిగిన హింసాత్మక సంఘటనలు చాలా బాధాకరమైనవి. గత సంవత్సరం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, అగ్నివీరులు నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యం వారిని ఉన్నతంగా…