సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ స్పందించారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం.. అదే తరహాలో అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోపోరాటానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న గులాబీ బాస్‌కు ఇప్పుడో మరో అస్త్రం దొరికినట్టు అయ్యింది.. వరి కొనుగోళ్లు, విద్యుత్ మీటర్లు, కేంద్రం వైఫల్యాలు ఇలా అనేక అంశాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు కేసీఆర్.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన విషయం తెలిసిందే.. అయితే, ఇప్పుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన…
అగ్నిపథ్ ఎందుకు మంటలు రేపుతోంది?కేంద్రం ఏమంటోంది? అభ్యర్థుల సమస్యేంటి?అగ్నిపథ్ పథకంతో ఆర్మీకి ప్రయోజనం ఎంత?జీతాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించటానికే ఈ స్కీమ్ తెచ్చారా? కేంద్ర ప్రభుత్వం మంగళవారం త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమకు అన్యాయం చేస్తోందంటూ సైనిక నియామక రిక్రూట్‌మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న యువకులు దేశంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళనలు…
దేశ రక్షణ కోసం ఆర్మీ సేవలు ఎంతో అవసరం.. దేశాన్ని రక్షించేందుకు బోర్డర్‌కు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నవారే.. ఇప్పుడు దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.. ఆర్మీలో చేరడమే మా కల.. ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం అంటున్న అభ్యర్థులు.. ఆందోళనకు దిగి విధ్వంసమే సృష్టించారు.. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే, అగ్గి రాజేసింది మాత్రం అగ్నిపథ్ పథకమే అని చెప్పాలి.. సైన్యం రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ, ‘అగ్నిపథ్’ పేరిట కొత్త పథకానికి కేంద్ర…
అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ వేల మంది అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టషన్ లో ఉదయం ఒక్కసారిగా స్టేషన్లోకి దూసుకువచ్చారు. రైళ్లకు నిప్పు పెట్టారు. కట్టెలు, రాడ్లు, రాళ్లతో అక్కడి షాపులపై దాడులు చేశారు. పోలీసుల కాల్పుల్లో వరంగల్ కు చెందిన రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఎం.ఎం.టి .యస్ సర్వీసులను రెండు రోజులు రద్దు దీంతో (శనివారం) నేడు అల్లర్లు జరగకుండా మందస్తు చర్యగా జంటనగరాల్లో తిరిగే ఎం.ఎం.టి .యస్ సర్వీసులను రెండు రోజులు రద్దు చేసిన…
దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు కూడా పాకింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా…
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మాట్లాడుతూ.. ‘అగ్నిపథ్’పై దేశంలోని పలుచోట్ల చెలరేగుతున్న నిరసనలను తాను ఊహించలేదని అన్నారు. ఈ పథకం దేశానికి, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా నిరసనలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అగ్నిపథ్.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ స్కీమ్’ అంటూ చెప్పుకొచ్చారు.…
అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్. కోట్లాది రూపాయల రైల్వే ఆస్తుల విధ్వంసాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే GRP ( గవర్నమెంట్ రైల్వే పోలీసు ) మరియు రాష్ట్ర ఇంటలిజెన్స్ పూర్తిగా విఫలమైంది. పలు రైళ్లు రద్దయి లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వందల సంఖ్యలో ఉన్న ఆందోళన…
దేశంలో ‘అగ్నిపథ్’ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కీమ్ పై ఆర్మీ ఆశావహుల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ప్రారంభం అయిన ఆగ్రహ జ్వాలలు మెల్లిగా దేశం మొత్తం పాకుతున్నాయి. ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం నాలుగేళ్ల కాలపరిమితితో ఈ అగ్నిపథ్ స్కీమ్ రావడంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు, ఆగ్రహానికి గురవుతున్నారు. అగ్నిపథ్…