తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోపోరాటానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న గులాబీ బాస్‌కు ఇప్పుడో మరో అస్త్రం దొరికినట్టు అయ్యింది.. వరి కొనుగోళ్లు, విద్యుత్ మీటర్లు, కేంద్రం వైఫల్యాలు ఇలా అనేక అంశాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు కేసీఆర్.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన విషయం తెలిసిందే.. అయితే, ఇప్పుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి.. భారీ విధ్వంసమే జరిగింది.. ఆందోళనల్లో ప్రాణనష్టం కూడా జరిగింది.
Read Also: Breaking: టీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి విజయారెడ్డి
కేసీఆర్ ఫోకస్ ఇప్పుడు అగ్నిపథ్ పథకంపై పడిందట.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనలు జరిగాయి.. భారీ ఆస్తినష్టంతో పాటు.. పోలీసుల కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతిచెందాడు.. ఇప్పటికే రాకేష్ కుటుంబానికి తాము ఉన్నామంటూ భరోసా కల్పించిన కేసీఆర్.. ఆ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక, అగ్నిపథ్‌పై పోరాటానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం గులాబీ పార్టీ బాస్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.. వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కార్యాచరణకు పూనుకుంటారని.. మీడియా సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.