Afzal Guru Grave: ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఉగ్రవాదులు అప్జల్ గురు, మక్బూల్ భట్ సమాధులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కింద నమోదైన ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టేసింది. విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ దాఖలు చేసిన పిల్‌లో సమాధులు 'తీర్థయాత్ర' స్థలంగా మారాయని పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై డేటాను కోరింది.
Swati Maliwal: ఢిల్లీకి కాబోతున్న కొత్త ముఖ్యమంత్రి అతిషీపై, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేస్తున్న తరుణంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషీని ఎన్నుకున్నారు. అయితే, ఆమెపై అదే పార్టీకి చెందిన స్వాతి మలివాల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుకి ఉరిశిక్షని నిలిపేయాలని పోరాడిన కుటుంబం అతిషీది అని ఆమె అన్నారు.
Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.