మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు కమాండ్ మే 14న, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని…
Bengal Violence: గత కొన్ని రోజులుగా బెంగాల్‌లో వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో హింస తీవ్రంగా మారింది. ఆందోళనకారుల ముసుగులో పలువురు అల్లర్లకు పాల్పడ్డారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు వల్లే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. 150 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Manipur Violence: మణిపూర్‌లో ఐదు నెలల క్రితం మొదలైన హింసాకాండ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. ఇంటర్నెట్, పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఉద్రిక్తత నేపథ్యంలో ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
నాగాలాండ్ లో గతేడాది మిలిటెంట్లని పొరబడుతూ.. ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 13 మంది అమాయక పౌరులు చనిపోయారు. డిసెంబర్ 4, 2021 న నాగాలాంట్ లోని మోన్ జిల్లా ఓటింగ్ లో ఈ ఘటనల జరిగింది. తాజాగా ఈ ఘటనలో సంబంధం ఉన్న ఓ ఆర్మీ అధికారితో పాటు 29 మంది సైనికులపై ఛార్జ్ షీట్ దాఖలైంది. నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మొత్తం 30 మంది పేర్లను…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసోం, మణిపూర్, నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కుదిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. AFSPA (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) పేరుతో ఈ చట్టాన్నిఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది. అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను…
నాగాలాండ్ నుంచి AFSPA (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) ఉపసంహరణ అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర హోం శాఖ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం ఆమోదం తెలిపారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)రద్దు అంశంపై కేంద్రం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలోఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో నాగాలాండ్…