ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసింది. అబుదాబిలో అక్టోబర్ 14న జరిగిన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి.. సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా 5వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. చివరి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 200 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అబుదాబిలో ఈ రికార్డు తేడాతో ఓడిపోవడం బంగ్లాదేశ్‌కు ఇదే మొదటిసారి. ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా ఐదో…
Virat Kohli: ఆఫ్ఘనిస్తాన్ నేత, తాలిబాన్ ఉద్యమ నాయకుడు అనస్ హక్కానీ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన వచ్చింది. విద్య, క్రీడలు అంటేనే కోపగించుకునే తాలిబాన్లలో కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అనాస్ హక్కానీ కూడా క్రికెట్‌కు, కోహ్లీకి అభిమాని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లపై హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరు మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు.
ఆఫ్ఘన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్ ఆస్ట్రేలియాకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇప్పుడు ఎవరూ ఆఫ్ఘన్ జట్టును తేలికగా తీసుకోరు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా రాణించింది. ఇప్పుడు మేము మరింత బలంగా ఉన్నాము. తర్వాత జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మ్యాచ్ సెమీ ఫైనల్స్ మార్గాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడం వల్ల' అని ట్రాట్ పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా.. ఇంగ్లండ్- అఫ్ఘానిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ పై ఆఫ్గాన్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌటయ్యారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బుధవారం ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లీష్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి ఇబ్రహీం ఘనత సాధించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 3వ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయింది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ పై పొగడతల వర్షం కురిపించాడు. పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్ అని రషీద్ లతీఫ్ అభివర్ణించారు.
Rashid Khan: అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావోను అధిగమించి, ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 4న పార్ల్ రాయల్స్, MI కేప్ టౌన్ మధ్య జరిగిన SA20 క్వాలిఫయర్ 1లో రషీద్ ఈ అరుదైన ఘనత సాధించాడు. డ్వేన్ బ్రావో 2024లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ముందు 631 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అయితే,…
Azmatullah Omarzai: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో సంచనాలను సృష్టించిన అజ్ముతుల్లా ఒమర్జాయ్ ‘ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‘ (ICC ODI Cricketer of the Year)గా ఎంపికైన తొలి ఆఫ్ఘన్ ఆటగాడిగా నిలిచాడు. 2024లో తన అద్భుత ప్రదర్శనలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఈ 24 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. అజ్ముతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) 2024లో ఆఫ్ఘనిస్థాన్ తరఫున తన బ్యాటింగ్ , బౌలింగ్ తో సత్తా చాటాడు. 14…
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీథర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్, దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శ్రీథర్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీథర్ పని తీరును బట్టి ఒప్పందంపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ‘న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టు, దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచ్‌ల…