T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌కు మెంటర్‌గా దినేశ్ కార్తిక్.. వాటే లక్కీ ఛాన్స్!
- ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
- ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెంటర్‌గా దినేశ్ కార్తిక్
- దినేశ్ కార్తిక్‌కు వాటే లక్కీ ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్‌కప్ 2026కు ముందు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్‌ను ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెంటర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. టీ20 ఫార్మాట్‌లో ఆఫ్ఘన్ జట్టు ప్రదర్శనను మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతోనే డీకేను మెంటర్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ టీమ్ ఆర్సీబీకి దినేశ్ కార్తిక్ బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్‌గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. డీకే భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20కు ఆడారు.
భారత క్రికెట్‌లో ఆటగాడిగా మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా దినేశ్ కార్తిక్ మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించే సామర్థ్యం, యువ ఆటగాళ్లతో సానుకూలంగా వ్యవహరించే నైపుణ్యం అతడి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ లాంటి ఎదుగుతున్న జట్టుకు డీకే అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్థాన్ టీమ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. టీ20 ఫార్మాట్‌లో స్పిన్ బౌలింగ్, దూకుడు బ్యాటింగ్‌తో పెద్ద జట్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే కీలక మ్యాచ్‌ల్లో అనుభవ లోపం కారణంగా కొన్ని విజయాలను చేజార్చుకుంది. ఈ లోటును పూరించేందుకే దినేశ్ కార్తిక్‌ను మెంటర్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
- Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
Also Read: T20 World Cup 2026: ఓడిపోతారని పాకిస్థాన్‌కు ముందే తెలుసు.. అందుకే ఈ డ్రామా!
మెంటర్‌గా దినేష్ కార్తిక్ ఆటగాళ్ల మానసిక స్థైర్యం, మ్యాచ్ ఫినిషింగ్, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకునే విధానం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా యువ బ్యాట్స్‌మెన్‌లు, వికెట్‌కీపర్లకు ఆయన ఇచ్చే సూచనలు జట్టుకు అదనపు బలంగా మారనున్నాయి. టీ20 వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీలో చిన్న తప్పిదమే మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉండటంతో.. కార్తిక్ అనుభవం కీలకంగా మారనుంది. టీ20 వరల్డ్‌కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ కూడా బలమైన ప్రణాళికతో టోర్నీలోకి దిగాలని భావిస్తోంది. కార్తిక్ మెంటర్‌గా బాధ్యతలు చేపడితే.. ఆఫ్ఘన్ జట్టు ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఇది డీకేకే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. సక్సెస్ అయితే టీమిండియాకు పనిచేసే అవకాశం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!