ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ఇంకా పూర్తిగా అధికారాన్ని చేజిక్కించుకోకముందే తమ ఆరాచక పాలనను మొదలుపెట్టారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. దీనికి సంబందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబూల్‌లోని ప్రజలను ఏమీ చేయబోమని చెబుతూనే, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, యూఎస్ ఆర్మీకి సహకరించిన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో కాబూల్ వాసుల్లో తెలియని భయం నెలకొన్నది. ఇప్పటి వరకు సాధారణ జీవనం…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక ఆక్కడ పరిస్థితులను రష్యా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. 2001 కి ముందు కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను పరిపాలించారు. అయితే, వారి అరాచక పాలన ఎంతో కాలం సాగలేదు. 2001లో ఉగ్రవాదులు అమెరికా వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై దాడులు చేసి కూల్చివేసిన తరువాత అమెరికా సైన్యం ఆఫ్ఘన్ లోకి అడుగుపెట్టి తాలిబన్లను తరిమికొట్టింది. అంతకు ముందు అంటే, 1979 ప్రాంతంలో అఫ్ఘన్‌కు రష్యా సహకారం అందించింది. ఆప్రాంతాన్ని సోవియట్ యూనియన్ తమ ఆధీనంలోకి…
ఏకే 47, రాకెట్ లాంచర్లు ఉంటేనే ఆఫ్ఘనిస్తాన్‌ను గజగజవణికిస్తున్నారు. అదే అధుతాన ఆయుధాలు, వైమానిక ఆయుధసంపత్తి ముష్కరుల చేతికి దొరికితే ఇంకేమైనా ఉన్నదా… ఆఫ్ఘన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. గత 20 ఏళ్ల కాలంలో 89 బిలియన్ డాలర్లతో ఆఫ్ఘనిస్తాన్‌కు అమెరికా అధునాత ఆయుధాలు, యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంకులు, 11 వైమానిక స్థావరాలను సమకూర్చింది. ఎలా వీటిని వినియోగించాలో సైనికులను తర్ఫీదు ఇచ్చింది. సైనిక శిక్షణ ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలు తప్పుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సెప్టెంబర్ 11 వరకు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రక్రియను అమెరికా వేగవంతం చేయడంతో తాలిబన్లు దురాక్రమణకు పాల్పడ్డాయి. వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాయి. ఆదివారంరోజున రాజధాని కాబూల్ నగరంలోకి ప్రవేశించడంతో ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయింది. ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్…
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల వశం అయిపోయింది.. ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు.. దీంతో ఆఫ్ఘన్లో తాలిబన్ల రాజ్యం వచ్చేసింది.. ఇక, కొత్త అధ్యక్షుడి ఎంపికపై దృష్టిసారించారు తాలిబన్లు.. ఈ క్రమంలో తాలిబన్ కోఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు తెరపైకి వచ్చింది.. ఆఫ్ఘన్ శాంతి చర్చల సమయంలో అత్యధికంగా అందరి నోళ్లలో నానినపేరు ఇది.. ఇంతకీ.. ఎవరీ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్.. ఆయనకు తాలిబన్ సంస్థకు ఉన్న సంబంధం ఏంటి? తాలిబన్…
ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబాన్లు హస్తగతమైంది. అధ్యక్షపదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ, కీలక బృందంతో కలిసి దేశం వెళ్లిపోయారు. తన నిష్క్రమణపై అష్రఫ్ ఘనీ ట్వీట్ చేశారు. తాలిబాన్లతో జరిగిన పోరాటంలో ఇప్పటికే అనేక మంది చనిపోయారని గుర్తు చేశారు. మరింత రక్తపాతం జరగకుండా అధికారం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తుపాకులు, కత్తులతో ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లపై ప్రజల గౌరవం, శాంతిభద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు ఘనీ. అయితే, ఇలా అధికారంలోకి వచ్చిన పాలకులకు చట్టబద్దత…
కాబూల్ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్ ఎయిర్ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన…