అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు చెరువులయ్యాయి. ఎటు చూసినా నీళ్లే. కాలు కదపలేని పరిస్థితి. ఇంకో వైపు విష పురుగులు, జంతువుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా 30 జిల్లాల్లో పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి.
రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.
నైరుతు రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా 145 మందికిపైగా మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డులు, పలు కాలనీలు, వంతెనలపై నీరు చేరింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతుండటంతో.. చాలా ప్�