అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘మేజర్’. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం కరోనా పేండమిక్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
Read Also : వై.యస్ జగన్ గా ‘స్కామ్ 1992’ ఫేమ్ ప్రతీక్ గాంధీ
తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని మలయాళంలోనూ విడుదల చేయబోతున్నారు. ఇందులో శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ మంచి రేటు పలకడంతో చర్చనీయాంశంగా మారింది. “మేజర్” హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయి. మేకర్స్ త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.