జూలై నుండి ‘మేజర్’ బాలెన్స్ షూటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ తొంభై శాతం పూర్తయింది. అడివి శేష్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘మేజర్’ సినిమాకి శేష్ స్క్రిప్ట్ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ తిరిగి జూలైలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, ”’మేజర్’ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేయనున్నామని తెలియజేయేందుకు చాలా సంతోషిస్తున్నాను. గత ఏడాది చిట్కుల్ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్’చిత్రీకరణ మొదలైంది. అక్కడ అంతగా చలిగా ఏం లేదు. కానీ ఆ ప్రాంతపు విజువల్స్, అక్కడివారితో ఉన్న జ్ఞాపకాలు మరువలేనివి. జూలైలో ‘మేజర్’ సినిమా షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందుతుంది” అంటూ చిత్ర నిర్మాత శరత్‌తో (చిట్కుల్‌లో జరిగిన మేజర్ సినిమా వర్కింగ్ స్టిల్) ఫోటోను షేర్ చేశారు అడివి శేష్. నవంబరు 26, 2008 న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలను రక్షించిన అమరవీరుడు సందీప్‌ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘గూఢచారి’ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకుడు.
Also Read : స్టాలిన్ కు లైకా ప్రొడక్షన్స్ రూ. 2 కోట్ల విరాళం
Also Read
ఇదిలా ఉంటే… ఇటీవల విడుదలైన ‘మేజర్’ టీజర్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రికార్డు వ్యూస్ వస్తున్నాయి. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు. అలాగే బిజినెస్ సర్కిల్స్‌లో ‘మేజర్’ సినిమా ఓ హాట్‌కేక్. ఈ సినిమా థియేట్రికల్ , ఇతర హాక్కుల కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ‘మేజర్’ సినిమా ఓవర్‌సీస్ హక్కులు ఫ్యాన్సీ ధరకు అమ్ముడైపోయిన విషయం తెలిసిందే. మహేష్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ఫ్లస్ ఎస్ మూవీస్ సంస్థల అసోసియేషన్‌తో సోనీ పిక్చర్స్ సంస్థ ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. అడివి శేష్ తో పాటు సాయి మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ళ, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!