యాక్షన్ థ్రిల్లర్ “గూఢచారి” థియేటర్లలో విడుదలై నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్ తన ట్విట్టర్ లో “ఈ రోజుతో గూఢచారికి మూడేళ్లు. నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సినిమా ఇది. ఆగస్టు ఎల్లప్పుడూ నాకు అదృష్ట మాసం కాబట్టి, ఈ నెల చివరిలో నెక్స్ట్ మిషన్ భారీ అప్‌డేట్! #జి2 ప్రకటన త్వరలో వస్తుంది!” అంటూ ట్వీట్ చేశారు. అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం “గూఢచారి”. 2018లో విడుదలైన ఈ తెలుగు స్పై థ్రిల్లర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో ఈ చిత్రం విజయవంతం అయ్యింది.
Read Also : ఉక్రెయిన్ లో ల్యాండ్ అయిన “ఆర్ఆర్ఆర్” టీం
ఇందులో అడివి శేష్, శోభిత ధూళిపాళ్ళ మధ్య కుదిరిన అద్భుతమైన కెమిస్ట్రీ బాగుంది. ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, మధు షాలిని, జగపతి బాబు తదితరుల నటన సినిమాలో మరో హైలెట్. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ గా “గూఢచారి-2″ను రూపొందించాలని అనుకుంటున్నారు. ఈ సంవత్సరం జనవరి నెలలో “గూఢచారి 2” గురించి మేకర్స్ ధృవీకరించారు. ఆగష్టు చివరికల్లా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వబోతున్నారు. ఈ సీక్వెల్ కు సంబంధించిన వివరాలను ఇంకా మేకర్స్ వెల్లడించలేదు. ప్రస్తుతం అడివి శేష్ తన అప్ కమింగ్ మూవీ “మేజర్” చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో శోభిత ధూళిపాళ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
It’s #3YearsforGoodachari today 🙂
— Adivi Sesh (@AdiviSesh) August 3, 2021
My most loved film.
It is especially The film children love the most.
Since August has always been a lucky month for me, a huge update of the next mission later this month!#G2
Announcement coming soon! pic.twitter.com/nD5RtlE7iw